పవన్ కళ్యాణ్ యూ టర్న్‌.. డిపాజిట్లు కూడా రావు

0ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో తాజాగా టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపీ సిఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దల్ని పదే పదే కలవడం, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలో తిష్టవేయడం కంటే లాలూచీ రాజకీయాలకు రుజువులేం కావాలని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా విమర్శలు చేయని పవన్‌కల్యాణ్‌ ఇప్పుడే ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారో అందరికీ తెలుసు. ద్రోహులు ఎవరికీ డిపాజిట్లు కూడా రావు. తప్పుడు పనులు చేసేవారు దొంగాట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

కుట్ర రాజకీయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని నియోజకవర్గాల్లో సైకిల్‌, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని ఇంటింటికీ ప్రచారం చేసి, కరపత్రాలు పంచాలని, గ్రామ గ్రామాన ప్రచారం ఉద్ధృతం చేయాలని ఈ సందర్భంగా ఆయన నేతలు ఆదేశాలు ఇచ్చారు.