మహా ప్రీమియర్: తారలు దిగి వచ్చిన వేళ

0

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ ఎఎంబీ సినిమాస్ లో జరిగింది. ఈ ప్రీమియర్ కు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ.. అయన కుటుంబ సభ్యులతో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా వివి వినాయక్.. పూరి జగన్నాధ్.. ఛార్మి..పరుచూరి గోపాలకృష్ణ.. తమ్మారెడ్డి భరద్వాజ.. యస్. గోపాల్ రెడ్డి.. సురేష్ బాబు.. వెంకీ అట్లూరి.. చందు మొండేటి.. నాగ్ అశ్విన్.. అజయ్ భూపతి తదితరులు హాజరయ్యారు. ఈ సెలబ్రిటీల రాకతో ఎఎంబీ సినిమాస్ లో సందడి నెలకొంది.

ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్.. వారాహి ప్రొడక్షన్స్.. విబ్రి మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మంచి రివ్యూస్.. డీసెంట్ మౌత్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ డిజాస్టర్ గా నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై ఉంది.
Please Read Disclaimer