ముంబై పార్టీల్లో సౌత్ గాళ్స్ హంగామా

0పార్టీలు – పబ్బు స్నేహాలు అంటే యమజోరుగా ఉంటారు తెలుగు హీరోయిన్లు. అయితే ఇక్కడి కంటే ముంబై వెళ్లినప్పుడు మరికాస్త స్పీడ్ పెంచేస్తుంటారు. సౌత్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా ఏలిన భామలు ఉత్తరాదిన సెటిలైతే చేసే హంగామా అంతా ఇంతా కాదు.

గోవా బ్యూటీ ఇలియానా ఉత్తరాదిన స్థిరపడ్డాక కెరీర్ ఆరంభం రెగ్యులర్ గా పార్టీల్లో కనిపిస్తూ హల్ చల్ చేసేది. బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో స్నేహం వల్ల కాస్త తగ్గిందే కానీ ఇల్లూ జోరు ఆపతరమా? ఇక మరో అందాల భామ తాప్సీ సైతం కెరీర్ ఆరంభం ముంబై లో పలు ఈవెంట్లలో – పార్టీల్లో తెగ హల్ చల్ చేసింది. ప్రస్తుతం 1నేనొక్కడినే ఫేం కృతి సనోన్ – విక్కీ డోనర్ ఫేం యామి గౌతమ్ హంగామా చూస్తుంటే చుక్కలు పార్టీకి దిగొచ్చాయా? అన్న తీరుగా ఉందిక్కడ. నిన్నటిరోజున నిర్మాత దినేష్ విజన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ స్టార్ల హడావుడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకకు మతిచెడే మెరుపుల డ్రెస్ లో దిగిపోయి నానా హంగామా చేసింది కృతి సనోన్. అలానే యామీ గౌతమ్ సైతం టైట్ ఫిట్ బ్లాక్ పార్టీవేర్ లో మతి చెడగొట్టింది. ఇక సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ రాజ్ కుమార్ రావ్ తో కలిసి నానా హంగామా చేసింది ఈ పార్టీలో. ఇదే వేడుకలో తన గాళ్ ఫ్రెండ్ తో యథావిధిగా దిగిపోయాడు యువహీరో వరుణ్ ధావన్. తన ఫ్రెండు నటాషా దలాల్ తో టిప్ టాప్ గా దిగిపోయాడు. ఆదిత్యారాయ్ కపూర్ – సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి బ్రేకప్ లవర్ బోయ్స్ ఇక్కడ కనిపించారు. ముకుపుడకల సోనాక్షి సిన్హా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.