ఆ ముద్దులు హద్దులు దాటాయ్

0


kissing-scenesబాలీవుడ్ కొత్త ప్రేమ జంట సుశాంత్ సింగ్ రాజ్ పుట్ – కృతి సనోన్ ఇప్పుడు తెగ షికారులు కొడుతున్నారు. వాళ్లని జంట అంటే వారు ఒప్పుకోవట్లేదులే. ఇకపోతే ఏ టివి షో లో చూసినా ఏ న్యూస్ చానల్ లో చూసినా వీళ్ళ గురించే. తమ కొత్త సినిమా ‘రాబ్తా’ కోసం ప్రమోషన్లు మీద ప్రమోషన్లు తో బిజీగా తిరుగుతూ వాళ్ళ కెమిస్త్రీని ఇటు ప్రేక్షకులకు పంచుతూ అటు వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ అతి కెమిస్త్రీకి ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర బ్రేక్ పడింది.

అందిన సమాచారం బట్టి దినేష్ విజాన్ డైరెక్ట్ చేస్తున్న ‘రాబ్తా’ లో కొన్ని హద్దు దాటిన ముద్దు సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని కొంచం తగ్గించి మళ్ళీ ఇవ్వమని చెప్పారు సిబిఎఫ్ సి బోర్డు మెంబర్స్. వాళ్ళ మాటలును బట్టి ఈ సినిమాలో “కొన్ని అసభ్యకర మాటలు ఉన్నాయి అని అవి ఇటువంటి ప్రేమ చిత్రాలు అవసరం లేదని చెబుతూ లీడ్ రోల్ చేస్తున్న హీరో హీరోయిన్ల మధ్య ముద్దు శృంగార సన్నివేశాలు కొన్ని తొలిగించాలని.. ముద్దు సీన్ల లెంగ్త్ కూడా కట్ చేయాలని.. లేకపోతే వాళ్ళ సినిమాకు A సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని” అంటున్నారు. U/A కావాలి అనుకుంటే సూచన చేసిన విధంగా మార్చండి అనిచెప్పారట.

సిబిఎఫ్సి ముఖ్య కార్యదర్శి పలాజ్ నిహలాని ఈ విషయం పై అడిగిన ప్రశ్న కు జవాబు చెప్పకుండా వెళ్ళిపోయారు. దినేష్ విజాన్ దీనికి ఎటువంటి చర్య తీసుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో మరో నటుడు రాజకుమార్ రావు జిమ్ సార్భ్ లు కూడా ముఖ్య పాత్రలలో కనపడనున్నారు. ‘రాబ్తా’ జూన్ 9న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతోంది.