లంXకొడకా.. సెన్సార్ అనుమతి ఎలా?

0

సినిమా రిలీజవుతోంది అంటే సెన్సార్ గడప దాటకుండా దానిని రిలీజ్ చేయడం కుదరదు. సీబీఎఫ్ సీ సర్టిఫికేషన్ అంటూ నానా రచ్చ ఉంటుంది. సెన్సార్ సభ్యులంతా ఏకముఖంగా సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజయ్యేది. అయితే సెన్సార్ బృందం వాళ్లు చెవులు మూసుకున్నారో ఏమో కానీ – నేడు రిలీజైన `భలే మంచి చౌక బేరము` చిత్రంలోని ఒకే ఒక్క పంచ్ సర్వత్రా చర్చకొచ్చింది.

దేశ రహస్యాల్ని అమ్ముకుని అడ్డ దారిలో డబ్బు సంపాదించేయాలనుకున్న కృష్ణానగర్ బ్యాచీ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని కాన్సెప్టు అందించిన మారుతి ముందే చెప్పారు. ఆ ప్రకారమే కృష్ణానగర్ రూమ్ బ్యాచ్ లు ఎలా ఆలోచిస్తారో సన్నివేశాలు చూపించారు. దేశాన్ని అమ్మేయడం అనే దుర్మార్గానికే తెగబడే యూత్ దగుల్భాజీతనం కథ ఇది. ఇందులో ఓ సన్నివేశంలో `లంXకొడకా` అని బూతు తిట్టించడం .. దానిని సెన్సార్ వాళ్లు చూసీ చూడనట్టు వదిలేయడం సినిమా చూసిన వాళ్లలో చర్చకొచ్చింది.

భారతదేశంలో పుట్టి – పాకిస్తాన్ వాళ్లకు మన బార్డర్ రహస్యాల్ని చెప్పేస్తార్రా? అన్న ఆవేశంలో ఆర్మీ రిటైర్డ్ మేజర్ అయిన రాజా రవీంద్ర పార్వతీశం అండ్ బ్యాచ్ ని దారుణంగా తిట్టేస్తాడు. ఆ సందర్భంలో ఎమోషన్ అతికినట్టే ఉన్నా.. మరీ అంత పెద్ద బూతు పదాన్ని సెన్సార్ కట్ అన్నదే లేకుండా వేసేశారే అన్న విమర్శ ఎదురైంది. కనీసం మ్యూట్ అయినా చేయలేదక్కడ. దీనిపై క్రిటిక్స్ లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer