పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

0Padma-Awards2017 ఏడాదికి గాను పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ తోపాటు విశ్వమోహన్ భట్, సాక్షి మాలిక్, పుల్లెల గోపీచంద్, ప్రముఖ నేపథ్యగాయని ఆశా పారేఖ్, గాయకులు కైలాష్ ఖేర్, శంకర్ మహాదేవన్, సోనూ నిగమ్, బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్, మనోజ్ బాజ్ పేయి, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, రంగస్థల నటుడు బసంతి బిస్త్, కథాకళి నృత్యకారుడు సీకే నాయర్‌లకు పద్మ పురస్కారాలు లభించాయి.

దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌ను దక్కించుకున్నవారిలో ఎన్సీపీ నేత శరద్ పవార్, బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి, లెజెండరీ సింగర్ కేజే ఏసుదాస్‌లకు పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. వీరితో పాటు జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్, లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, సుందర్ లాల్ పత్వాలకు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అయితే ఈ ఏడాది భారతరత్న అవార్డును ఎవరికీ ప్రకటించలేదు.

పద్మశ్రీ పురస్కారాలను క్రీడారంగంలో భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్‌లకు అవార్డులు లభించాయి. ఎయిడ్స్‌పై రిసెర్చ్ చేస్తున్న డాక్టర్ సునీతా సాల్మన్, సినీ విమర్శకుడు భావనా సోమయ్య, గాయని అనురాధా పౌడ్వాల్ లకు పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.

ఈ ఏడాది 120 మందితో పద్మ అవార్డుల జాబితాను రూపొందించింది. ఎలాంటి రికమండేషన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సమగ్ర శోధన అనంతరమే.. ప్రభుత్వం పద్మ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది.