కూకట్‌పల్లిలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు

0chain-snaching-in-kukatpallహైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. హౌసింగ్ బోర్డు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వసంత్‌నగర్ 9వ ఫేజ్‌లో గురువారం ఉదయం చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడు క్షణాల్లో ఆమె మెడలోంచి చైన్‌ను లాక్కెల్లాడు. అలాగే మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ దగ్గర కూడా మరో చైన్‌స్నాచింగ్ జరిగింది. కాగా… ఈ సంఘటనలు సమీపంలోని సీసీ కెమెరాలో నమోదు కావడంతో వాటి ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.