‘ఛల్ మోహన్ రంగ’ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాకే..

0నితిన్ , మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ & పీకే క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కిన మూవీ చల్ మోహన్ రంగ. మొదటి సారి పవన్ కళ్యాణ్ వేరే హీరోతో తన బ్యానర్ లో సినిమా నిర్మించడం , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ అందించడం తో మంచి అంచనాల మధ్య ఏప్రిల్ 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. దీంతో మొదటి రోజు కలెక్షన్స్ చాలా దారుణం గా వచ్చాయి.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల 83లక్షల షేర్ రాగా , కోటి రూపాయలకు పైగా నైజాం నుంచి కలెక్ట్ కావడం విశేషం.

ఇక ఏరియాలవారిగా ఫస్ట్ డే కలెక్షన్ల చూస్తే…

నైజాం – రూ. 1.06 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు