బాలయ్య ఎన్టీఆర్ లపై షాకింగ్ కామెంట్స్

0Chalapathi-Rao-Comments-on-ntr-balayyaకేరక్టర్ నటుడు చలపతి రావు పేరు వివాదాల్లో వినిపించేది కాదు కానీ.. ఈ మధ్య ఈయన పేరు బాగానే బైటకు వస్తోంది. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్ లో చలపతి చేసిన కామెంట్స్ రచ్చ ఆ సినిమాకి బాగానే ప్లస్ అయింది. ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన చలపతి బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరూ పెద్దాయనకు సరైన వారసులు కాదని అనేయడం సంచలనం అవుతోంది.

‘తారక్ ఎలాంటి పాత్ర అయినా చేయగల సమర్ధుడు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ డ్యాన్స్ లలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే.. రావణాసురుడి పాత్ర చేయగల పొడగరి మాత్రం కాదు. ఒక వ్యక్తి నటనా సామర్ధ్యం గురించి మాట్లాడ్డం సరికాదు. అయితే.. ఎవరైనా తనతో రావణుడి పాత్ర చేయిస్తే నేనేం అభ్యంతరపెట్టను కదా. కానీ ఆ నిర్ణయాన్ని పాస్ చేయాల్సినది ఆడియన్స్’ అన్నాడు చలపతి రావు.

‘గుండమ్మ కథను రీమేక్ చేయడం సరైన ఆలోచన కాదు.. ఎఎన్నార్ చేసిన రొమాంటిక్ రోల్ ను ఎలాగోలా మేనేజ్ చేసినా.. ఎన్టీఆర్ పాత్రకు తగిన వారు ఎవరూ లేరు. రాముడు భీముడు.. గుండమ్మ కథ లాంటి క్లాసిక్స్ చేయాలనే ఆలోచన సరికాదు. బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ లలో ఆయనకు తగిన వారసులు ఎవరూ లేరు. వీరిద్దరిలో ఎవరూ ఆ లెజెండ్ కు సరితూగలేరు. పెద్దాయనకు 10 కిలోమీటర్ల వరకూ ఎవరూ రాలేదు’ అనేశాడు ఈ కేరక్టర్ ఆర్టిస్ట్.

‘ప్రభుత్వ అవార్డులు పనికిి రానివని ప్రజల ప్రేమే అంతిమం అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. వాటిని తీసుకునేందుకు హాజరయ్యే వారికే ఇచ్చేవారు. పరిశ్రమ హైద్రాబాద్ కు వచ్చినపుడు అవార్డ్ ఈవెంట్ జరిగే రోజుల్లో అందుబాటులో ఉండేదెవరు అని ఆరా తీసేవారు నిర్వాహకులు’ అన్నాడు చలపతి రావు.