మహిళలకు క్షమాపణలు చెప్పిన చలపతిరావు

0chalapathi-commentsతన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై చలపతి సోషల్‌ మీడియాలో స్పందించారు. నారీలోకానికి నమస్కారం మంటూ తన ఫేస్‌బుక్‌ లైవ్‌ను మొదలుపెట్టారు. తన వ్యాఖ్యలకు డబుల్‌ మీనింగ్‌ తీసుకున్నారంటూ దాటవేత వైఖరిని తీసుకున్నారు. అంతేకాదు తనకు మహిళలపట్ల గౌరవం ఉందనీ, మహిళల పట్ల అవమానకరంగా వున్న యాంకర్‌ ప్రశ్నకు చాలా నిజాయితీగా, కోపంగా మాట్లాడాను తప్ప వేరే ఏమీ కాదంటూ చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు హానికరం అనే ఆ మాట అడగవచ్చా అని ఆయన ప్రశ్నిచారు. అలా అంటే ఒక్క మగాడు కానీ, మహిళ కానీ ఖండించలేదన్నారు. అందుకే తాను అలా స్పందించానన్నారు. అంతేకాదు మీరు హర్ట్‌ అయి ఉంటే.. సారీ అంటూనే నేనేమీ బెదిరిపోను.. నేను చాలా గట్టివాడినంటూ వ్యాఖ్యానించడం విశేషం.

నా విజయం వెనుక నా భార్య ఉంది. 40ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది.. అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా.. వేరే మహిళవైపు చూడకుండా సంసారాన్ని దిద్దుకొచ్చాను. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. జై మహిళా లోకం అంటూ ముగించారు.

ఈ వివాదంపై ఇప్పటికే నాగార్జున కూడా స్పందించడం తెలిసిన సంగతే. తను మహిళలను గౌరవిస్తాను అని, చలపతిరావు వ్యాఖ్యానాలను ఖండిస్తున్నాను అని నాగార్జున ట్వీట్ చేశారు.