జబర్ధస్త్: చంద్రా కోటి ఖరీదైన ఇల్లు!

0

పోటుగాడు.. నీటుగాడు.. ఆటగాడు.. అంతకుమించి మొరటోడు..ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా? మగాడై ఉండి ఆడవేషం కట్టగలరా? నాటు మోటు సరసమాడే సత్తా ఉందా? ఒకవేళ ఉంటే చాలానే సాధించవచ్చు. “కుదిరితే పెద్ద స్టార్ అవ్వొచ్చు.. కుదరకపోతే కనీసం జబర్ధస్త్ స్టార్“గా అయినా మిగలొచ్చు. కృష్ణానగర్ – యూసఫ్ గూడ – ఫిలింనగర్ లో అద్దె కడుతూ.. తిండికి టికాణా కొట్టకుండా రూమ్ మెయింటెయిన్ చేయగలిగితే చాలు. ఇక్కడ చాలానే సాధించవచ్చు.. …చమ్మక్ చంద్రా అలియాస్ జబర్ధస్త్ చంద్రా లాగా.

అవమానాలుంటాయి.. తిట్లుంటాయి.. నిందలు వేస్తారు.. అంతకుమించి పక్కాగా శత్రువులుంటారు.. పక్కనే ఉండి పక్కలో పోటు పొడిచేవాళ్లుంటారు. స్నేహితుడే అయినా గొంతు నులిమేసేవాళ్లుంటారు. ఎదిగేవాడిని పట్టి కిందికి లాగేసేవాళ్లకు కొదవేం లేదు. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితే ఇదిగో ఇలా చంద్రాలాగా కోటి ఖరీదైన ఇల్లు – ఓ బెంజి కారు సొంతం చేసుకోవచ్చంతే! నటుడంటే డీసెంట్ గానే ఉండాలి. బిగ్గరగా అరిస్తే ఆడు నటుడేంటహే! అని అవహేళన చేస్తారా? ఏదైనా చేస్కోండి! చంద్రా కొట్టేసాడంతే! ఏం చేసైనా మొత్తానికి లైఫ్ లో సెటిల్డ్. పల్లెటూరి నుంచి వచ్చాడా? పట్నం నుంచి వచ్చాడా? కాదు .. కొడ్తే గోల్ పోస్ట్ లో పడిందా.. లేదా? అన్నదే ముఖ్యం ఇక్కడ.

`జబర్ధస్త్` షో ఎందరికో లైఫ్నిచ్చింది. కొందరైతే హీరోలుగా రాణిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా క్షణం తీరిక లేని వాళ్లు ఉన్నారు. యాంకర్లు అయితే మూడు చేతులా సంపాదిస్తున్నారు. హీరోయిన్లుగా – క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఒకటేమిటి దొరికిందంతా తురిమేస్తున్నారు. జబర్ధస్త్ రియాలిటీ షో ఎందరో తిండికి తికాణా లేని వాళ్లకు తిండి పెట్టిందని ఆ షోలో నటించేవాళ్లే చెబుతారు. ఆ బ్యాచ్ లోంచే ఒకడు… చంద్రా. ఒకప్పుడు అద్దె కొంపలో ఈగలు ముసిరే చోటే నివశించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితేనేం.. సంపాదించాడు. హైదరాబాద్ కి మణిహారం లాంటి ఖరీదైన ఏరియా మణికొండలో కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అంతేనా కాస్ట్ లీ బెంజి కార్ కొనుక్కున్నాడు. బెంజి పాతదా.. కొత్తదా.. సెకండ్సా.. ఫస్టా అన్నది కాదు. అది బెంజేనా కాదా? అన్నదే ఇంపార్టెంట్. జబర్ధస్త్ ఆదాయం ఆర్జిస్తున్న ఈ కుర్రాడి గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. లైఫ్ ఇలానే జోష్ ఫుల్ గా సాగిపోతే మునుముందు షకలక శంకర్ – సప్తగిరి – ధన్ రాజ్ లాగా హీరో అయిపోతాడేమో? ప్చ్!!
Please Read Disclaimer