అథ్లెట్ ఛాన్స్ ఇప్పించరూ ప్లీజ్!

0ఎలివేట్ చేసుకునే సుగుణం ఉండాలే కానీ ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు – యూట్యూబ్ ట్యాలెంటుకు డైరెక్ట్ రహదారిలా దారి చూపిస్తున్నాయి. ఆ కోవలోనే యూట్యూబ్ సెన్సేషన్ గా అందరికీ సుపరిచితమంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. యూట్యూబ్ లో ఈ అమ్మడి లఘుచిత్రాలు పాపులరవ్వడంతో ఆ తర్వాత సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. 2015లో కేటుగాడు సినిమాతో తెరంగేట్రం చేసిన చాందిని – అటుపై 2016లో కుందనపు బొమ్మ చిత్రంలో నటించింది. 2017లో శమంతకమణి చిత్రంలో అద్భుత నటప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది `హౌరా బ్రిడ్జ్` అనే క్రేజీ చిత్రంలో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈలోగానే చాందిని నటించిన `మను` రిలీజ్ కి రెడీ అవుతోంది.

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ సరసన చాందిని `మను` చిత్రంలో నటించింది. ఇదివరకూ రిలీజైన `మను` ట్రైలర్ ఆద్యంతం చాందిని థ్రిల్లింగ్ యాక్ట్ ఆకట్టుకుంది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 7) మను రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది ఈ భామ. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఇంటర్వ్యూలో చాందిని మాట్లాడుతూ .. తనకు ఎలాంటి పాత్రల్లో నటించడం అంటే ఇష్టమో తెలియజేసింది. స్వతహాగానే తాను క్రీడాకారిణి.. ఆటగత్తెగా రాణించానని తెలిపింది. అందుకే తనకు క్రీడాకారిణి బయోపిక్ లో నటించాలనుందన్న కోరికను వెలిబుచ్చింది.