ది గ్రేట్ లీడర్ : చంద్రబాబు@ 40

0ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి 40ఏళ్లు పూర్తయింది. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని వారి శ్రేయస్సు కోసం దీర్ఘ ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న నాయకుడిగా ఆయన రాజకీయ జీవితంలో నేటికి 40ఏళ్లు . తెలుగు జాతి భవిత కోసం తన విజన్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయ యౌవనికపై ప్రత్యేక గుర్తింపు పొందన నాయకుడు చంద్రబాబు.

మరోవైపు చంద్రబాబు రాజకీయాల్లోకి ప్రవేశించి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి నేతల సందడి నెలకొంది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున తరలివచ్చారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 40కిలోల భారీ కేక్‌ తెప్పించి సీఎంతో కట్‌ చేయించారు. ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లలో పండగగా వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అభిమానులు.