ఇదీ మాధవన్‌ గొప్పదనం

0హీరో మాధవన్ మల్టీ ట్యాలెంటడ్. మంచి చదువరి. చాలా స్కిల్స్ వున్నాయి ఆయనలో. మంచి వక్త కూడా. ఇప్పుడీ సుగుణాలన్నీ చూశారు సవ్యశాచి యూనిట్. అందుకే ఆయన్ని ఉద్దేశింఛి ఒక ఉత్తరం రాశాడు దర్శకుడు చందూ మొండేటి.

డియర్‌ మ్యాడీ సర్‌..మేం మీతో ప్రేమలో పడి 17 ఏళ్లు. మీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. మీరు పబ్లిక్‌గా మాట్లాడే తీరు కూడా అందరికీ నచ్చుతుంది. దర్శకుడిని నమ్మి అతని విజన్‌ను మెరుగుపరిచే ఓ గొప్ప నటుడు, జెంటిల్‌మెన్‌తో కలిసి మేం పనిచేసినందుకు చాలా గర్విస్తున్నాం. ఎప్పటిలాగే మీ స్టార్‌డం ఈ ప్రాజెక్ట్‌ విలువను మరింత పెంచింది. మీ నటనకు సెట్స్‌లోని ప్రతి ఒక్కరూ అభిమాని అయిపోయారు. మీరు ఈ సినిమాకు ఒప్పుకోవడంతోనే సగం విజయం సాధించినట్లు అనిపించింది. ‘సవ్యసాచి’ చిత్ర బృందం మిమ్మల్ని సగౌరవంగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానిస్తూ ధన్యవాదాలు చెప్తోంది.” అని రాసుకొచ్చారు చందూ.