చిరు లో ఇంతలో అంత మార్పా ?

0chiruకేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి లో ఒక్కసారిగా పెనుమార్పు చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఆయన డైలాగ్ వెర్షన్ మారిపోయింది. ఇప్పటిదాకా సమైక్యాంధ్ర విషయంలో గోడమీద పిల్లిలా వ్యవహరించటమే కాక తాను అధిష్టానానికి విదేయుడినని ఆయన స్పష్టంగా ప్రకటించారు. సీమంద్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమంలో తనకు వ్యతిరేకంగా కూడా ఆందోళన కారులు ఎంతగా రేచ్చిపోతున్నప్పటికి ఆయన కించిత్ కూడా తొణకలేదు. పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన బల్ల గుద్ది చెప్పారు. అయితే మంగళవారం నాడు పార్లమెంటు లో సిమాంధ్ర ఎం పి ల నిరసనప్రదర్సనలొ పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అధిష్టానం ధోరణిని విమర్శిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరచింది. తెలుగు ప్రజలతో కాంగ్రెస్ ఆటలాడు తోందని, ప్రజల్లో అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించేసిందని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఆంటోని కమిటి ఏమిటని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి వాయిస్ లో వచ్చిన ఈ మార్పు గమనించిన అందరూ ” ఏదో జరిగింది ” అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.