చరణ్ 150 కోట్లు సాధిస్తాడా..?

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ మగధీర రేంజి లో ప్రశంసలు అందుకున్నాడు. చాలామంది చరణ్ కు పెద్దగా యాక్టింగ్ రాదని , కేవలం మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఆలా నెట్టుకొస్తున్నాడనే విమర్శలకు రంగస్థలం తో చెక్ పెట్టాడు. ఈ మూవీ లో చరణ్ యాక్టింగ్ కు మిగతా హీరోల అభిమానులు కూడా ఫిదా అయ్యారు. మార్చి 30న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.

అయితే ఈ సినిమా నిర్మాతలు అలాగే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే 150 కోట్ల వసూళ్ల ని సాధించాలి , అప్పుడే ఈ సినిమాని కొన్న బయ్యర్లు కూడా లాభాలు పొందుతారు లేదంటే కేవలం నిర్మాతలు మాత్రమే సేఫ్ జోన్ లోకి వెళతారని తెలుస్తుంది. ఇప్పటికే మూడు రోజులకు గాను ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.84 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు గాను రూ. 35 కోట్లు , ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 53 కోట్ల షేర్ ను వసూళ్లు చేసిందని సమాచారం. రాబోయే రోజుల్లో ఇంకాస్త పెరిగే అవకాశం లేకపోలేదు. చూద్దాం చరణ్ ఎంత కలెక్ట్ చేస్తాడో.