చరణ్ రాజకీయ ప్రచారం మొదలు పెట్టాడు…

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయ ప్రచారం మొదలు పెట్టాడు అనగానే బాబాయ్ జనసేన గురించా అనే సందేహం రావొచ్చు..కానీ ఇక్కడ చరణ్ చేస్తుంది సినిమాలోని రాజకీయం గురించి..ప్రస్తుతం రామ్ చరణ్ , సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం మూవీ లో నటించాడు. 1985 కాలం నాటి బ్యాక్డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కింది. కాగా ఈ మూవీ లో నటుడు ఆది పొలిటికల్ లీడర్ పాత్రలో నటించాడు. కాగా ఆ ఊరి సర్పంచ్ గా ఎన్నికల్లో నిలబడతాడు ఆది.

అతనికి అండగా హీరో ఎన్నికల ప్రచారంలోకి దిగుతాడు. దానికి సంబదించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఆది వెనుక నిలుచొని ప్రజలకు అభివాదం చేస్తుంటే , చరణ్ ముందు ప్రజలకు గుర్తుంపు కాగితాలను పంచుతున్నట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే సినిమాలోని పొలిటికల్ సాంగ్ ఆ గట్టునుంటావా నాగన్న.. అనే పాట జనాల్లో బాగా పాపులర్ అయ్యింది. ఇక వెండి తెర ఫై ఆ సాంగ్ ఎలా ఉంటుందో అని అంత ఎదురుచూస్తున్నారు. ఈ నెల 30 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.