ఛార్మిలోని ఎగ్జిబిషనిజమ్

0ఎగ్జిబిషనిజమ్ అనేది చెప్పుకోదగ్గ స్కిల్. ఈ స్కిల్ లో పంజాబీ బొమ్మ ఛార్మి ఆల్వేస్ టాప్లో ఉంటుంది. టాప్ టు బాటమ్ అందాల్ని ఎలివేట్ చేయడంలోనే కాదు తనలోని నటనపరమైన స్కిల్స్ ని ఛార్మి ఓ రేంజులో ఎలివేట్ చేసింది. అందుకే ఎంత ఠఫ్ కాంపిటీషన్ ఉన్నా దశాబ్ధం పాటు టాలీవుడ్లో తన ఉనికిని చాటుకోగలిగింది. ఒకే ఒక్క `మహ మహ..` సాంగ్ తో కుర్రాళ్ల గుండెల్లో ముళ్లులా గుచ్చుకుపోయింది. శ్రీ ఆంజనేయం – మంత్ర – మంగళ- జ్యోతిలక్ష్మి లాంటి చిత్రాల్లో ఛార్మి బోల్డ్ ఎటెంప్ట్ ని తెలుగు యువత ఎప్పటికీ మర్చిపోలేరు.

అయితే కాలక్రమంలో నవతరం నాయికల నుంచి మల్లూ భామల నుంచి పోటీ పెరగడంతో ఛార్మికి అవకాశాలు తగ్గాయి. ఆ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి `పూరి కనెక్ట్స్` కంపెనీ సీఈవోగా.. ఈవెంట్ మేనేజర్ కం కాస్టింగ్ సెలక్షన్ మేనేజర్ గా – ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బృహత్తర బాధ్యతల్ని చేపట్టారు. ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్ ని హీరోగా ప్రమోట్ చేసేందుకు ఛార్మి తనవంతు కృషి చేస్తోంది.

అదంతా ఓ యాంగిల్ అనుకుంటే ఛార్మిలోని వేరొక యాంగిల్ ని తరచి చూడాలి. ఛార్మి స్వతహాగానే పంజాబీ గాళ్ కాబట్టి తనకు సాంప్రదాయాలు ఎక్కువే. తన ఇంటికి వెళితే ఛార్మి సకుటుంబ సపరివారంగా నచ్చిన పద్ధతిలో ఫుల్ చిలౌట్ చేస్తుంది. మొన్న రక్షాబంధన్ రోజు అన్నయ్య – కుటుంబ సభ్యులతో ఛార్మి సెలబ్రేషన్స్ చేసుకుంది. తన అన్నయ్యకు రాఖీ కట్టి – అటుపై స్వీట్ తినిపిస్తూ ఛార్మి ఆటపట్టించింది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. అయితే ఎగ్జిబిషనిజమ్ లో స్పెషలిస్ట్ అయిన ఛార్మి ఈ వీడియోని ఓ రేంజులో ఎగ్జిబిట్ చేయడం చర్చకొచ్చింది. కొందరు అయితే మరీ అంత ఎగ్జిబిట్ చేయాలా? అని కామెంట్ చేస్తున్నారు. ఎవరి ఇష్టాన్ని వారికి వదిలేయాలి! ఛార్మి లైఫ్ లో ఒకే ఒక్క మరక.. అది డ్రగ్స్ లో తన పేరు వినిపించడం. ఇంత సాంప్రదాయబద్ధమైన కుటుంబంలోంచి వచ్చి ఛార్మి అలాంటి పని చేసిందంటారా?