ఒకసారి ఫిక్స్ అయితే డబ్బుకు లొంగను

0

హీరోయిన్ గా పుష్కర కాలంకు ఎక్కువే సినిమాల్లో నటించిన ఛార్మి ఆ మద్య వచ్చిన జ్యోతి లక్ష్మి చిత్రం తర్వాత మళ్లీ కనిపించలేదు. ఈమెకు ఆఫర్లు తగ్గాయని కొందరు అనుకుంటూ ఉన్నారు. అయితే ఐటెం సాంగ్స్ లేదా ముఖ్య పాత్రల్లో అయినా ఛార్మికి అవకాశాలు వచ్చే అవకాశాలు వస్తాయి. కాని ఆమెకే నటనపై ఆసక్తి లేదట. ఈ విషయంను స్వయంగా ఛార్మి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా నిర్మాణంపైనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పుకొచ్చింది.

ఛార్మి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను పూరి గారి దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బాధ్యత పూర్తిగా నేనే చూసుకుంటున్నాను. పూరి గారిపై ఉన్న అభిమానంతో ఆయన సినిమాలకు నిర్మాతలగా వ్యవహరిస్తూ పూరి కనెక్ట్స్ బాధ్యతలు చూసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే నాకు నటిగా ఐటెం సాంగ్స్ కు ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అయితే తనకు నటనపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. ఇన్ని సంవత్సరాలు నటిగా చేసిన నాకు నటనపై బోర్ కొట్టిందని చెప్పుకొచ్చింది.

బోర్ కొట్టి నటనకు గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి సమయంలో మళ్లీ పారితోషికం భారీగా ఇస్తామన్నంత మాత్రాన నేను మనసు మార్చుకుని నటించేందుకు సిద్దపడను అంటూ ఛార్మి చెప్పుకొచ్చింది. ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత డబ్బు కోసం తన నిర్ణయాన్ని మార్చుకోబోను అంటూ ఇకపై నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లే అంటూ ఛార్మి క్లారిటీ ఇచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ తో పూరి పూర్వ వైభవంను దక్కించుకుంటాడని ఛార్మి చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత వరుసగా సినిమాలను నిర్మిస్తానంటూ ఛార్మి పేర్కొంది.
Please Read Disclaimer