త్రిష.. పెళ్లి చేసుకుందామా? బర్త్ డే విషెస్ ట్వీట్ లేదా

0

అందరిలా ఉంటే చార్మింగ్ ఛార్మి ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి. అందుకే.. అందరి కంటే భిన్నంగా ఉండే ఆమె అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా చెన్నై బ్యూటీ త్రిష పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తో వార్తల్లోకి చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షాల్ని.. అందరిలా చెప్పి ఉంటే.. మనమిప్పుడు ఛార్మి గురించి మాట్లాడుకునే వాళ్లమే కాదు.

తాజాగా ఆమె పెట్టిన ట్వీట్ లో.. బేబీ.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రపోజల్ ను ఎప్పుడు అంగీకరిస్తావా? అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా అంటూ ట్వీట్ చేసింది. ఏందిది? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలోనూ త్రిషకు ఛార్మి ఇదే రీతిలో విషెస్ చెప్పి అందరి నోట నానింది.

అప్పట్లో ఛార్మి ప్రపోజల్ కు త్రిష ఓకే చెప్పినా.. అది సరదాగా ఉండిపోయింది. ఒకే సమయంలో తెలుగు తెర మీద రాణించిన బ్యూటీలలో త్రిష.. ఛార్మిలు ఇద్దరు మంచి స్నేహితులు. త్రిష ఇప్పటికి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఛార్మి మాత్రం ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టింది. ఇద్దరికి పెళ్లి కాకపోవటం.. ఇద్దరికి లవ్ బ్రేకప్స్ అయినట్లుగా వార్తలు వస్తుంటాయి. మొత్తానికి.. ఛార్మి తాజా ప్రపోజల్ కు త్రిష ఈసారి ఏమని బదులిస్తారో?
Please Read Disclaimer