దాదా లవర్ గా కీర్తి సురేష్ రియల్ బామ్మ

0

ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది . సరైన కంటెంట్ ఉండాలే కాని హీరో వయసుతో నిమిత్తం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా సార్లు రుజువయ్యింది. అదే కోవలో వస్తున్న దాదా 87 ఇప్పుడు సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో విశేషం ఏమిటంటే నిన్నటి తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ చారు హాసన్ టైటిల్ రోల్ పోషించడం. అదొక్కటే స్పెషల్ కాదు. మహానటిలో మెప్పించిన కీర్తి సురేష్ బామ్మ సరోజ ఆయనకు లవర్ గా నటించింది.

ఇప్పుడు చారు హసన్ వయసు 87 ఏళ్ళు. ఇంత వయసులోనూ ఈ పాత్ర చేయడం చూసి పోస్టర్ ట్రైలర్ లో షాక్ తిన్న వాళ్ళే అందరూ. విచిత్రమేమిటంటే చారు హాసన్ ఇప్పటిదాకా హీరోగా నటించనే లేదు. సోదరుడు కమల్ హాసన్ లోక నాయకుడిగా గొప్ప ఖ్యాతిని ఆర్జించినా ఈయన మాత్రం సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా తెల్ల గెడ్డంతోనే కనిపించిన చారు హాసన్ మొదటి సారి లుక్ ను మార్చుకుని దాదాగా మారిపోయారు

32 ఏళ్ళ క్రితం జరిగిన ముఠా తగాదాలను ఆధారంగా చేసుకుని ఓ గ్యాంగ్ స్టర్ నిజజీవిత కథ ఆధారంగా దాదా 87 రూపొందింది. మార్చ్ 1 విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. తెలుగు వెర్షన్ వచ్చే ఛాన్స్ లేదు. ఆ రోజు ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండటంతో పాటు దాదా హక్కులు మనవాళ్ళు ఎవరూ కొనలేదు.

ఒకవేళ అక్కడ హిట్టయ్యాక రీమేకో లేదా డబ్బింగో అప్పుడు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఒక నటుడు ఇంత లేట్ ఏజ్ లో హీరోగా నటించడం అనే అరుదైన ఘనత మాత్రం ఒక్క చారు హసన్ కే దక్కింది.విజయ్ శ్రీ దర్శకత్వం వహించిన దాదా 87లో కీర్తి సురేష్ బామ్మ నటించడం కూడా ఆసక్తిని పెంచుతోంది


Please Read Disclaimer