భూధార్‌ కు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

0‘భూ యాజమాన్య మార్పిడిలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా భూధార్‌ ఉపయోగపడుతుందన్నారు’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భూసేవ పైలెట్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా భూసేవ పథకం అమలు చేయనున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ప్రతి వ్యక్తి రికార్డులను ఆధార్‌కు అనుసంధానం చేశాం. ఒక్క పైసా అవినీతి లేకుండా నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టాం. టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే వెనుకబడతాం. నాలుగేళ్లలో కేంద్రం సహకరించకపోయినా… ఎవరికీ కష్టం లేకుండా అన్ని వసతులు కల్పించాం” అని వివరించారు.