చెర్రీకి అప్పుడే ఇద్దరు పిల్లలా…!!

0cherryహీరో రామ్ చరణ్ గురించి చాలామందికి తెలియని అతడి వ్యక్తిగత విషయాలు ప్రముఖ ఇంగ్లిష్ ఛానల్’టైమ్స్ నౌ’ నిర్వహించే ‘స్టార్’ కార్యక్రమంలో ఈ వారం చూపెట్టానున్నారు. ఒక గంట సేపు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో చరణ్ జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పటివరకూ చూడని ఫోటోలతో ఈ పరిచయ కార్యక్రమం ఒక  డాక్యుమెంటరీ రానున్నది. ఈ కార్యక్రమం ఈ వీకెండ్ ఆగష్టు 10, 11 తేదీలలో టైమ్స్ నౌ ఛానల్లో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి ఈ చానల్ విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్ తాను ఎంతో, ప్రేమగా పెంచుకున్న గుర్రం, కుక్క పిల్లలతో కనిపిస్తాడు.

ఇందులో చరణ్ మాట్లాడుతూ తన గుర్రం కెమెరాలకు ఫ్రెండ్లీ కాదని తన దృష్టిలో తన గుర్రం కూడా దాదాపుగా మనిషే అని అంటూ తన కుక్కను, గుర్రాన్ని తన సొంత పిల్లలు లా చూసుకుంటానని, ఒక విధంగా చూస్తే ఈ రెండు తన పిల్లలేనని చెప్పాడు. బాలీవుడ్ సెలెబ్రెటీలు రణబీర్ కపూర్ అజయ్ దేవగన్, దీపిక పడుకోనె లాంటి టాప్ సెలెబ్రెటీలకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పటికే ప్రసారంచేసిన టైమ్స్ నౌ ఛానల్ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కు సంబందించి ఒక సెలెబ్రెటీని తమ జాతీయ చానల్ లో పరిచయం చేయడం ఇదే ప్రప్రధమం. చెర్రీ గురించి తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వారంతా ఈ ప్రోగ్రాం చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి….