గ్లామర్ డోస్ పెంచేస్తున్న ఉత్తేజ్ కూతురు

0Chetana Uttejస్టార్ల వారసులు సినిమాల్లోకి వచ్చేయడం కొత్తేమీ కాదు. హీరోల విషయంలో అయితే.. ఇది ముందే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ డాటర్స్ కూడా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే.. వరుసగా స్టార్ కిడ్స్ దున్నేస్తున్నారు.

టాలీవుడ్ లో కూడా ఇలా స్టార్ల కూతుళ్లు అరంగేట్రం చేయడమే కాదు.. వరుస సినిమాలు చేస్తున్నారు కానీ.. బాలీవుడ్ మాదిరిగా గ్లామర్ డోస్ విషయంలో వెనకంజ వేస్తున్నారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూతురు చేతన కూడా సినీ అరంగేట్రం చేసేస్తోంది. అయితే.. ఇప్పటివరకూ టాలీవుడ్ స్టార్ల కూతుళ్లు లో పద్ధతిగా కనిపించే పాత్రలకే పరిమితం కాగా.. ఈమె మాత్రం సోనమ్ కపూర్ స్టైల్ ని ఫాలో అయిపోవాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో అమ్మడు వెనక్కి తిరిగి ఇచ్చిన పోజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే.

టాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్ కురిపించేందుకు తాను ఏ రేంజ్ లో రెడీ అనే విషయం చెప్పేసింది చేతన. గతంలో మంచు లక్ష్మి – నీహారిక మంజుల వంటి వారసులు తెరంగేట్రం చేసినా.. చేతన మాత్రం డిఫరెంట్ రూట్ ని ఎంచుకుందనే చెప్పాలి.