ట్రైలర్ టాక్: చి ల సౌ.. సింపుల్ – ట్రెండీ!

0హీరో సుశాంత్ తాజా చిత్రం ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రమోస్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశాడు. రెండు నిముషాలలోపే నిడివి ఉన్న టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ను మరోసారి క్లారిటీ గా చెప్పాడు డైరెక్టర్ గా మారిన నటుడు రాహల్ రవీంద్రన్.

ట్రైలర్ ఒక పోలీస్ స్టేషన్ లో రాహుల్ రామకృష్ణ కామెడీ సీన్ తో స్టార్ట్ అవుతుంది. ఇక సుశాంత్ ను అందరూ పెళ్లి పెళ్లి అని వేధిస్తుంటారు. మరోవైపు హీరోయిన్ రుహాని ‘మేమేమైనా వాషింగ్ మిషన్లమా ఫీచర్స్ చూసి కొనడానికి?’ లాంటి షార్ప్ డైలాగులతో హీరో కు షాకులిస్తుంటుంది. ఇక ఇలాంటి వాళ్ళ మధ్యలో తిప్పలు పడే పెళ్ళీడుకొచ్చిన యువకుడిగా సుశాంత్ రోల్ సహజంగా ఉంది. ‘హైదరాబాద్ లో రెండు రకాల అమ్మాయిలుంటారు. ఐదర్ సింగల్ ఆర్ ఇంట్రెస్టింగ్.. నెవర్ బోత్’.. సుశాంత్ చెప్పే ఈ డైలాగ్ ఇక లవ్ లో పడ్డాడని ఇండికేషనే!

పెళ్ళంటే ఇష్టం లేక ఆ టాపిక్ ను దాటవేస్తున్న హీరో పెళ్లి చేసుకోమని పోరు పెట్టే తల్లి.. టిపికల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తో ఉన్న హీరోయిన్.. ఫైనల్ గా హీరో అమ్మాయితో లవ్ లో పడడం ఇవన్నీ జనరల్ గా ఒక లవ్ స్టొరీ లో ఉండే విషయాలే అయినా ఈ జెనరేషన్ కు తగ్గట్టు సింపుల్ అండ్ ట్రెండీ డైలాగులతో చెప్పడం ఈ ట్రైలర్ లో ఉన్న ఒక హైలెట్.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి ప్లెజెంట్ గా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ – లవ్ – కామెడీ అన్నీ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరినట్టే ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సుశాంత్ బాబు గట్టిగా కొట్టేట్టే ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ కూడా తోడయింది కాబట్టి సినిమా పై హైప్ పెరిగినట్టే. ‘చి ల సౌ’ ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది.