చైనావోడి ఫ్లైట్ ట్రైన్ వేగం లెక్క తెలిస్తే అవాక్కే?

0

ఇప్పటివరకూ చాలానే రైళ్ల గురించి విన్నాం. స్పీడ్ రైల్ అని.. బుల్లెట్ రైల్ అని.. అయితే.. ఫ్లైట్ తో పోటీ పడే ట్రైన్ గురించి ఇప్పటివరకూ విన్నది లేదు. ఆ ముచ్చటను తీర్చేయనున్నాడు చైనావోడు. చైనావాడి బుర్రలో ఏముందో కానీ.. వాడికొచ్చే ఐడియాలు అన్నిఇన్ని కావు. కాసింత దూరానికి బుల్లెట్ ట్రైన్ కోసం కిందా మీదా పడుతూ.. దానికి అయ్యే ఖర్చు లెక్కలకు గుండెలు దడదడలాడుతున్న వేళ.. బుల్లెట్ అమ్మమ్మ మొగుడు లాంటి ఫ్లైట్ ట్రైన్ ను తెర మీదకు తీసుకొచ్చాడరు చైనీయులు.

ఈ ట్రైన్ గంటకు ప్రయాణించే వేగం ఎంతో తెలుసా? అక్షరాల వెయ్యి కిలోమీటర్లు. అంటే.. ఇంచుమించు ఫ్లైట్ స్పీడ్.ఆ మాటకు వస్తే.. మరికాస్త ఎక్కువ స్పీడే అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాయు వేగంతో దూసుకెళ్లే ఈ ట్రైన్ ను 2025 నాటికి.. అంటే..మరో ఏడేళ్లలో పట్టాల మీదకు ఎక్కించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.

దీనికి సంబంధించిన స్కేల్ మోడల్ ను సిచౌహన్ ప్రావిన్స్ లోని చెంగ్డూ సిటీలో జరుగుతున్న నేషనల్ మాస్ ఇన్నొవేషన్ అండ్ అంట్రప్రిన్యూర్ షిప్ ఎగ్జిబిషన్ లో చైనా ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన బోగీల అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపక్క చైనావోడు ఆ రకంగా దూసుకెళుతుంటే.. మనమేమో గంటకు మూడు..నాలుగు వందల కిలోమీటర్లస్పీడ్ తో వెళ్లే ట్రైన్ గురించే కిందా మీదా పడుతున్నాం. ఎటూ లేట్ అయ్యింది. బుల్లెట్ ట్రైన్ కు బదులు.. ఈ ఫ్లైట్ స్పీడ్ ట్రైన్ ను తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో? కాస్త.. ఆలోచించండి మోడీజీ!
Please Read Disclaimer