భర్త కోసం చిన్మయి పెద్ద సాయం

0భార్యాభర్తలు ఒకే వృత్తిలో ఉంటే దాని వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉంటాయి. ఇద్దరిలో ఏ ఒక్కరు ఇండస్ట్రీతో సంబంధం లేని వారు అయినా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వస్తున్న డెబ్యూ మూవీ చిలసౌ కోసం ప్రమోషన్ చేయడానికి రంగంలోకి దిగింది డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ఎప్పుడు తెరవెనుక ఉంటూ హీరోయిన్ల ముద్దు ముద్దు మాటలకు తన గాత్రదానం చేసిన చిన్మయి ఇప్ప్పుడు భర్త కోసం ప్రమోషన్ చేయడానికి రెడీ అయిపోయింది. సుశాంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెల 27 విడుదల అని అన్నారు కానీ అది వాయిదా పడుతుందా లేదా చెప్పిన తేదికి వస్తుందా అనే అనుమానం మాత్రం తొలగిపోలేదు. దానికి బలం చేకూరుస్తూ ఆన్ లైన్ బుకింగ్ లో ఇంకా దీన్ని అందుబాటులో ఉంచలేదు. సో రావడం డౌట్ అని ఫిలిం నగర్ టాక్. సాక్ష్యంతో పాటు పెళ్లి నేపధ్యంలోనే వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ పోటీలో ఉండటంతో రిస్క్ వద్దని డ్రాప్ అయ్యే సూచనలు ఉన్నాయి.

చిన్మయి ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూతో కలివిడిగా ఉంటూ ప్రొమిషన్ లో విస్తృతంగా పాల్గొంటోంది. సుశాంత్ మార్కెట్ తక్కువగా ఉండటంతో వీలైనంత బజ్ వస్తే కానీ ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే సోషల్ మీడియాతో పాటు అన్ని కవర్ చేసేలా ఇంటర్వ్యూలతో హోరెత్తించేలా ప్లాన్ చేస్తున్నారు. చిన్మయి ఇంత యాక్టివ్ గా బయట కనిపించడం ఇదే మొదటిసారి. రాహుల్ రవీంద్రన్ హీరోగా చేసిన సినిమాల గురించి కూడా చిన్మయి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ చిలసౌ దర్శకుడిగా ఆయన కల నెరవేరబోతున్న క్షణం కాబట్టి తాను కూడా అండగా నిలుస్తోంది. ఇవన్నీ సరే కానీ కంటెంట్ రాజ్యమేలుతున్న ట్రెండ్ లో సుశాంత్ అంత కొత్తగా ఏం ట్రై చేసుంటాడా అనే ఆసక్తి మొదలయ్యింది. చైతు సమంతాతో సహా అన్నపూర్ణ సంస్థ బ్యాకింగ్ బాగా ఉండటంతో చిలసౌ గురించి జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మొదటి హిట్ ఇదే అని గట్టి నమ్మకం పెట్టుకున్న సుశాంత్ కోరిక ఇదైనా నెరవేరుస్తుందో లేదో చూడాలి.