కేటీఆర్‌ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నాడు..

0తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావు తన సహృదయాన్ని చాటుకున్నాడు..సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికీ సాయం చేసే కేటీఆర్‌ , మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి కంటిచూపు సమస్యతో కొన్ని రోజులుగా బాధపడుతోంది. చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది.

ఈ పరిస్థితుల్లో భరత్‌ అనే ఓ నెట్‌జన్‌ వారి సమస్యను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. బాధితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో వర్తించడంలేదంటూ సమస్యను మంత్రి కేటీఆర్‌కు వివరించాడు. చికిత్సకు సిఫారసు చేసి చిన్నారికి అండగా ఉంటాలని ట్విటర్‌లో కోరాడు. దీనిపై స్పందించిన మంత్రి తప్పక సహాయమందిస్తామని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వర్గాలతో మా‍ట్లాడి తగిన విధంగా ఆదుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. స్వయం గా కేటీఆర్‌ భరోసా ఇవ్వడం తో ఆ కుటుంబం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కష్టాల్లో ఉన్నామంటే మన రాష్ట్రమా..పక్క రాష్ట్రమా అని చూడకుండా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కేటీఆర్‌ కు అందరూ జయహో చెప్పాల్సిందే.