చిన్నల్లుడు గారికి చిరు సలహా!

0మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే చాలామంది హీరోలు ఉన్నారు. తాజాగా మెగా ట్యాగ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన లక్కు ను ‘విజేత’ ద్వారా టెస్ట్ చేసుకున్నాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా సక్సెస్ – ఫెయిల్యూర్ సంగతి పక్కన బెడితే ‘విజేత’ కు పూర్ ఓపెనింగ్స్ రావడం అందరినీ షాక్ కి గురించి చేసింది.

ఇదే విషయం మెగా ఫ్యామిలీ ని ఆలోచనలో పడేసిందట. పైగా సినిమా కూడా డిజాస్టర్ కావడంతో – మెగాస్టార్ చిరంజీవి తన చిన్నల్లుడికి రెండో సినిమా సైన్ చేసేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకోమని సలహా ఇచ్చాడని అంటున్నారు. ఆ సమయంలో నటనను మెరుగుపరుచుకోవడంతో పాటు డ్యాన్స్ – ఫైట్స్ లో కూడా మెళకువలు నేర్చుకోమని సూచించాడట. మామగారి సలహాతో కళ్యాణ్ ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే మెగాస్టార్ తన అల్లుడిని ఈ సారి ఒక సీనియర్ దర్శకుడి చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటివరకైతే సెకండ్ సినిమాకు మంచి స్టోరీ ఏదీ దొరకలేదని టాక్. ఈ సారి కళ్యాణ్ కోసం చిరు భారీగానే ప్లాన్ చేసేలా ఉన్నాడు. ఈ సారి చిన్నల్లుడు గారు ప్రేక్షకులను మురిపించేందుకు ఏం చేస్తాడో వేచి చూడాలి.