40 వసంతాల మెగా దాంపత్యం

0

తెలుగు సినీ చరిత్రలో లెజెండ్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి అప్పుడు ఇప్పుడు అనే తేడా లేకుండా ఎప్పటికి తానే మెగాస్టార్ అనిపించుకుంటూ ఉన్నాడు. తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవంను దక్కించుకున్న చిరంజీవి ఎన్నో మైళు రాళ్లను క్రాస్ చేశాడు. ఆ క్రమంలో ఆయన భార్య సురేఖ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా అప్పుడప్పుడే సినీ కెరర్ ను నెట్టుకు వస్తున్న చిరంజీవిని చూసి అల్లు రామలింగయ్య ముచ్చటపడ్డాడట. హీరోగా మంచి ఉన్న వ్యక్తి అంటూ మెగాస్టార్ ను సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా తన కూతురును ఇచ్చి పెళ్లి కూడా చేశారట.

సురేఖ గారు చిరంజీవి జీవితంలో అడుగు పెట్టిన తర్వాత పూర్తిగా మారిపోయింది. 1980 – ఫిబ్రవరి 20వ తారీకున వీరి వివాహం జరిగింది. వివాహం తర్వాత చిరంజీవి కొద్ది కాలానికే సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా మారిపోయాడు. చిరంజీవి సినిమాలతో బిజీగా ఉంటే కుటుంబ బాధ్యత మొత్తం తాను చూసుకునే వారు. ఇద్దరు బిడ్డలు – ఒక కొడుకుతో కుటుంబంను సురేఖ ఒక చక్కని గృహిణి మాదిరిగా చక్కబెడుతూ వచ్చారు. చిరంజీవి ఇంతటి విజయం వెనుక ఖచ్చితంగా సురేఖ ఉంటారని చెప్పుకోవచ్చు.

సురేఖతో వివాహం అయ్యి 40 వసంతాలు పూర్తి చేసుకున్న చిరంజీవి ఆమెతో ఇప్పటికి కూడా ప్రతి సినీ వేడుకకు పబ్లిక్ ఫంక్షన్ కు హాజరు అవుతూనే ఉంటాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినా – సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగు వెలిగినా కూడా ఆయన వెనుక – వెన్నంటి ఉండి ఆయన్ను సురేఖ నడిపించారనడంలో సందేహం లేదు.

అందరికి ఆదర్శం అయిన చిరంజీవి – సురేఖ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
Please Read Disclaimer