15 ఏళ్ల రికార్డును క్రాస్ చేసిన ఖైదీ!

0khaidi-no-150-storms-into-the-2-million-clubమెగాస్టార్ చిరంజీవి తనకు తానే సాటి అని రుజువు చేస్తున్నాడు. తన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ద్వారా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచేసిన చిరు.. వైజాగ్ ఏరియాలో బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరు మరో అనితర సాధ్యమైన రికార్డును అందుకున్నాడు. పదిహేనేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును చిరు దాటేశాడు. గత రికార్డు కూడా చిరుదే కావడం విశేషం.

2002లో విడుదలైన ‘ఇంద్ర’ సినిమా తూర్పు గోదావరి జిల్లా తునిలో 18 లక్షల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ రికార్డును తర్వాత ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేకపోయింది. ఆ రోజుల్లోనే 18 లక్షలంటే మామూలు విషయం కాదు. కాల క్రమంలో టికెట్ల రేట్లు బాగా పెరిగినా.. రూపాయి విలువ బాగా తగ్గినా కూడా తునిలో 18 లక్షల షేర్ రికార్డును ఏ సినిమా కూడా దాటలేకపోయింది. ‘బాహుబలి లాంటి సినిమాకు కూడా అది సాధ్యం కాలేదు.

ఐతే ఇప్పుడు తన రికార్డును బద్దలు కొట్టడానికి చిరునే రంగంలోకి దిగాడు. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ తునిలో 11వ రోజుకు 18.74 లక్షల షేర్ వసూలు చేసి ఇంద్ర రికార్డును బద్దలు కొట్టింది. బాస్ ఈజ్ బ్యాక్ అనే మాటకు మరింత న్యాయం చేకూర్చిన రికార్డిది. గత దశాబ్దన్నర కాలంలో రెవెన్యూ పరంగా ఎన్నో మార్పులొచ్చినా ఇంత కాలం చిరు రికార్డు నిలిచి ఉండటం.. దాన్ని మళ్లీ చిరునే బద్దలు కొట్టడం అసాధారణమైన విషయం.

loading...