ఆ లుక్ చిరంజీవి వల్ల అవుతుందా?

0Chiranjeevi-Inteview-picమెగాస్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా చేయబోతున్నాడనగానే చిరు ముఖానికి మెలితిరిగిన మీసాలు.. నెత్తిన తలపాగా.. నుదుటన బొట్టు పెట్టేసి ఒక స్కెచ్ రెడీ చేసేశారు అభిమానులు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆ లుక్ హల్ చల్ చేస్తోంది. అది చూస్తే నిజంగా చిత్ర యూనిట్టే దాన్ని డిజైన్ చేసిందేమో అనిపించేస్తోంది జనాలకు. ఐతే అది ఫ్యాన్ మేడ్ లుక్. చిరుకు ఆ తరహా మేకప్ వేస్తే ఆయన కూడా అలాగే కనిపించొచ్చేమో. ఐతే ముఖం వరకు మేనేజ్ చేయడం వేరు.. మొత్తంగా చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా మారడం వేరు. చిరు ఇప్పుడున్న వయసులో ఉయ్యాలవాడ ఆహార్యానికి తగ్గట్లుగా మారడం కష్టమనేది విశ్లేషకుల మాట.

ఉయ్యాల వాడ ఆరడుగుల ఆజానుబాహుడు. ఆయనది కండలు తిరిగిన శరీరం. ఆయన భారీకాయంతో ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఉయ్యాలవాడకు సంబంధించిన చిత్రాలు చూసినా ఈ విషయం అర్థమవుతుంది. రూపం విషయంలో చరిత్రలో ఆధారాలు లేని వ్యక్తుల పాత్రలు చేసినపుడు ఎలా కనిపించినా సరిపోతుంది. ఉదాహరణకు శాతకర్ణిని చూపించవచ్చు. ఆయనెలా ఉండేవారో ఎవరికీ ఐడియా లేదు కాబట్టి బాలయ్య ఎలా కనిపించినా సరిపోయింది. కానీ ఉయ్యాలవాడ ఎలా ఉంటాడో జనాలకు ఐడియా ఉంది కాబట్టి.. అందుకు తగ్గట్లే అథెంటిగ్గా కనిపించాలి. అలా కనిపించాలంటే చిరు చాలానే కష్టపడాల్సి ఉంటుంది. మరి చిరు ఆ స్థాయిలో ఇప్పటికప్పుడు కష్టపడి కండలు పెంచగలడా అన్నది డౌటు. ఆయన ఆరు పదులకు పై వయసులో ఉన్నాడు. ఇప్పుడు కండలు.. సిక్స్ ప్యాక్స్ పెంచడం అంటే చిన్న విషయం. ఆ కష్టం పడకుండా చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రకు ఏమాత్రం సరిపోతాడో చూడాలి.