టీవిలో నాగ్ లాగా మెప్పించలేకపోతున్న చిరంజీవి

0chiranjeeviమీలో ఎవరు కోటీశ్వరుడు కొత్త సీజన్ మొత్తానికి మొదలైంది. ఎప్పుడో డిసెంబరులో మొదలు కావాల్సింది కాని, అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతే ఏం .. బాస్ ఈజ్ బ్యాక్. ఖైదీ నం 150 తో బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన మెగాస్టార్ ఇప్పుడు టీవి టీఆర్పిల రికార్డులను క్రియేట్ చేసే పనిలో నిమగ్నమైపోయారు.

చిరంజీవిని చూడాలనే ఆసక్తితో టీఆర్పీ ఎలాగూ వస్తుంది కాని, ప్రేక్షకులు నిజంగా మెగాస్టార్ హోస్టింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. నాగార్జున ఈ షోతో జనాల్ని విపరీతంగా అలరించారు. నెం.1 స్థానంలో “మీలో ఎవరు కోటీశ్వరుడు” ని కూర్చోబెట్టారు. లెక్కలు పక్కనపెడితే, కంప్యూటర్ ముందు కూర్చోని నాగార్జున అడిగే ప్రశ్నలకి జనాలు అలవాటుపడిపోయారు.