మెగా గేమ్ షో రేటింగ్స్ తగ్గడానికి రీజన్స్

0MEK2మెగాస్టార్ చిరంజీవితో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో చేయించాలనే మాటీవీ ఆలోచన బయటకు వచ్చినప్పటి నుంచి విపరీతమైన ఆసక్తి కనిపించింది. అయితే.. ఈ ఆసక్తి రేటింగ్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం సహకరించడం లేదు.

చిరు చేస్తున్న ఈ సిరీస్ మీలో ఎవరు కోటీశ్వరుడుకు.. రేటింగ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. ఒకానొక స్థాయిలో 3-4 పాయింట్లకు కూడా రేటింగ్ తగ్గిపోతోందట. మాటీవీని.. స్టార్ మా ఛానల్ గా మార్చేందుకు.. తగిన బ్రాండింగ్ గా ఈ షోను ఎంచుకుంది ఛానల్ యాజమాన్యం. అలాగే చిరుకు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 75 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ కార్యక్రమం చేస్తున్నారట. అయితే.. ఇప్పుడు రేటింగ్స్ పడిపోవడానికి కారణాలు అంటూ.. ఓ ఐదు రీజన్స్ ను చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో అడిగే ప్రశ్నల్లో ఎక్కువ శాతం సినిమాలకు సంబంధించినవే ఉంటున్నాయి. అది కూడా చిరు ఫ్యామిలీకి లింక్ అయి ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చిరంజీవి షో చేస్తున్నపుడు.. ఆయన కుటుంబం గురించి ప్రశ్నలు ఉండడం సబబు కాదని అంటున్నారు. ఈ గేమ్ ను ఆసక్తికరంగా రూపొందించడం అంటే.. ప్రశ్నలు సంక్లిషంగా ఉండాల్సిందే. ఈ సిరీస్ లో అదే లోపించిందని చెప్పుకోవచ్చు.