అమ్మతో మెగాస్టార్ కబుర్లు

0మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే మరో మూడు రోజుల్లో రానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దానికి తోడు ఒక రోజు ముందే సైరా టీజర్ వస్తుండటంతో ఆ ఆనందం రెట్టింపు అవుతోంది. అందుకేనేమో చిరు కూడా ఈ సారి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎన్నడూ లేనిది తన తల్లి అంజనా దేవి గారితో కలిసి జాయింట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక లీడింగ్ కాలమ్ కోసం చిరు ఇచ్చిన ఈ ముఖాముఖీలో అమ్మతో కలిసి చాలా విశేషాలే పంచుకున్నారు. అమ్మతో ఇప్పటి దాకా తమతో లేరని నాన్న వదిలిన జ్ఞాపకాల కోసం పాత ఇంట్లోనే ఉండేవారని ఈ మధ్య కాస్త వెలితిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించడంతో తన దగ్గరికి వస్తాను అంటే సంతోషంగా ఆహ్వానించానని ఇదే తనకు అమ్మ పది రోజుల ముందే ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటూ సంబరపడిపోయారు. అంతే కాదు తమ్ముళ్లు నాగబాబు పవన్ లను పిలిచి మీ దగ్గర నా లాగే కార్లు బంగళాలు ఉన్నా అమ్మ మాత్రం తనదగ్గరే ఉందని దీవార్ లో అమితాబ్ స్టైల్ లో చెప్పి నవ్వులు పూయించారట.

మొత్తానికి అమ్మ అంజనాదేవి గారు సైతం చాలా ఆసక్తికరమైన విశేషాలు షేర్ చేసుకున్నారు. డాన్స్ విషయంలో చిరు తర్వాతే ఎవరైనా అని తన కంటే బాగా చరణ్ చేస్తాడు అనే విషయాన్నీ ఒప్పుకోనని తేల్చేసారు. ఖైదీ నెంబర్ 150 చూసినప్పుడు పట్టలేని ఆనందం కలిగిందని చెప్పిన అంజనాదేవి గారు సైరాతో రంగస్తలం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని కోడలు సురేఖగారితో చెప్పేశారట. మొత్తానికి చిరు వద్దకు అమ్మ రావడంతో ఆయన సంతోషం మొహంలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తాలూకు పేపర్ స్కాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సైరా టీజర్ ఎల్లుండి విడుదల కానున్న నేపధ్యంలో అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సైరా గెటప్ లో చిరు ఎలా ఉంటాడు అనే దీని మీద పూర్తి స్పష్టత ఇప్పటిదాకా లేదు కాబట్టి ఏకంగా వీడియో రూపంలో అది చూడబోతున్నాం అన్న తలపే వాళ్లకు బాగా కిక్ ఇస్తోంది. దానికి తోడు వాళ్ళ బాస్ అమ్మతో కూర్చుకుని ఇలా కబుర్లు చెబితే అంతకన్నా ఏం కోరుకుంటారు.