మెగాస్టార్ నో అంటాడా?

0

విడుదలకు ముందు ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టు తయారయ్యింది బోయపాటి శీను పరిస్థితి. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకున్న వినయ విధేయ రామ ఫలితం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. కనీసం యావరేజ్ అనిపించుకున్నా పర్వాలేదు కాని అవుట్ రైట్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి రెండు రోజుల వసూళ్ళతో పాటు వీక్ ఎండ్ బాగానే రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వాటి ప్రాతిపదికన సూపర్ హిట్ అనే అవకాశం లేదు. ఎందుకంటే గత ఏడాది అజ్ఞాతవాసి ఇంత కన్నా దారుణంగా ఫెయిల్ అయినా యాభై కోట్లకు పైగా షేర్ తెచ్చింది. అయినా ఇది అభిమానులకు పీడకలే.

ఇది పక్కన పెడితే వినయ విధేయ రామ ఫలితం గురించి అందరి వేళ్ళూ బోయపాటి శీను వైపే వెళ్తున్నాయి.ఇలాంటి కథను ఎంచుకోవడంలో చరణ్ పొరపాటు ఉన్నప్పటికీ మరీ నేల విడిచి సాము చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం శీను తెలివితేటలే కదా. సో సరైనోడుతో తెచ్చుకున్న మెగా కాంపౌండ్ ఇంప్రెషన్ వివిఅర్ దెబ్బతో పోయిందనే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. మొన్నటి దాకా శీనుతో సినిమా చేయాలనీ తెగ ఆసక్తి చూపిన మెగాస్టార్ చిరంజీవి పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.

దీన్ని నిర్మించేందుకు ముందు నుంచి ఉత్సాహ పడ్డ సరైనోడు నిర్మాత కం బావమరిది అల్లు అరవింద్ సైతం డౌట్ గానే ఉన్నారట. మొత్తానికి వినయ విధేయ రామ ఎఫెక్ట్ మాములుగా లేదు బోయపాటి మీద. ఒకవేళ గతంలో నిజంగా మాట ఇచ్చి ఉంటే తప్ప ఇకపై చిరు బోయపాటి కాంబో మూవీ సాధ్యం కదాని మెగా సన్నిహితులు అంటున్నారు. ఎలాగూ సైరా తర్వాత కొరటాల శివ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు చిరు కమిట్ అయ్యాడు కాబట్టి మళ్ళి ఈ టాపిక్ ఓ రెండు మూడేళ్ళ తర్వాత వెలుగులోకి వస్తుంది.
Please Read Disclaimer