చిరు ఎక్జయిట్ అయినా జనాలు కాలే

0షామిలి.. ఇప్పుడంటే హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో ఓయ్ అని కుర్రాళ్లను పలకరించినా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు అమ్మమ్మగారిల్లు అంటూ మరోసారి కుటుంబకథా చిత్రంతో.. పక్కింటి అమ్మాయి పాత్రలో జనాలను పలకరించింది. ఇది హీరోయిన్ అయిన తర్వాత ఈ అందాల భామ చూపించిన రూపం.

కానీ షామిలి అనే కంటే.. బేబీ షామిలి అనే పేరుకే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. రెండేళ్ల వయసులోనే సినిమాలు చేయడం ప్రారంభించిన షామిలి.. అప్పట్లో ఓ స్టార్. ఈమెనే మెయిన్ క్యారెక్టర్ గా చేసి.. డబుల్ యాక్షన్ చేయించి మరీ లక్ష్మీదుర్గ వంటి చిత్రాలు తీసేయడం.. అవి విపరీతంగా ఆడేయడం కూడా జరిగాయి. ఇక దాదాపు అందరు స్టార్స్ తోను నటించిన ఈమె.. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిరంజీవి-శ్రీదేవిలతో కూడా కలిసి యాక్ట్ చేసింది. వారిద్దరూ తనను తెగ ముద్దు చేసే వాళ్లంటున్న షామిలి.. ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దులాడేవారని అంటోంది.

ఫిలిం ఫేర్ అవార్డుల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశానని అంటున్న షామిలి.. తను ఇప్పుడు ఇంత పెద్ద అమ్మాయిగా మారడం చూసి తెగ ఎగ్జయిట్ అయ్యారట. అప్పటి ఆ చిన్న పిల్ల.. ఇంత పెద్దమ్మాయి అయిపోయిందా అన్నారట. అయితే.. వారితో కలిసి చిన్నపుడు యాక్ట్ చేసింది కాబట్టి.. చిరు లాంటి స్టార్స్ ఎగ్జయిట్ అవుతారు. కానీ జనాలను మాత్రం ఈ చిన్నది తన యాక్టింగ్ తో కానీ అందంతో కానీ ఏ మాత్రం ఎగ్జయిట్ చేయలేకపోతోంది.