సూపర్ స్టార్ మెగాస్టార్ కు దారిస్తాడా?

0నెక్స్ట్ సమ్మర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయోగానీ అందరికంటే ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించింది మాత్రం ‘మహర్షి’ సినిమాకే. నెల క్రితమే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఏప్రిల్ 5 – 2019 న రిలీజ్ అవుతుందని కన్ ఫామ్ చేశాడు. కానీ ఇప్పుడు ఫిలిం నగర్ టాక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందట.

దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సినిమా ను సరిగ్గా అదే సమయంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట ‘సైరా’ టీమ్. మరి అలా కనుక ఏప్రిల్ 5 – 2019 కి అటు వారం ఇటు వారం రోజుల్లోపు ‘సైరా’ రిలీజ్ ప్లాన్ చేస్తే మహేష్ బాబు ను ‘సైరా’ టీమ్ డేట్ మార్పు విషయం లో రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్. మహేష్ గతంలో ‘బాహుబలి’ సినిమా కోసం తన ‘శ్రీమంతుడు’ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘సైరా’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కాంపిటీషన్ లో రిలీజ్ చేయడం కష్టం. మరి ఈ సారి కూడా అలాంటి పరిస్థితే వస్తే మహేష్ తన సినిమా డేట్ మార్చుకొని చిరు సినిమాకు దారిస్తాడా అనేది వేచి చూడాలి.

మహేష్ చరణ్ లు ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. అదొక్కటే కాకుండా చిరు ఫ్యామిలీ తో కూడా మహేష్ కు మంచి రిలేషన్ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే మహేష్ తన సినిమా డేట్ మార్చే విషయంలో పెద్దగా అభ్యంతరం ఉండక పోవచ్చని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో…!