సుప్రీమ్ కు సుప్రీమ్ సాయం

0ఇప్పుడంటే సుప్రీమ్ హీరోగా ఆ సినిమా హిట్టయ్యిందని సాయి ధరమ్ తేజ్ ని ఆ పేరుతో పిలుచుకుంటున్నాం కానీ ఒరిజినల్ సుప్రీమ్ హీరో చిరంజీవినే. ఆయన తర్వాత మెగాస్టార్ అయ్యారు కాబట్టి బిరుదు మారింది. ఇది అందరు ఒప్పుకునే విషయమే. కెరీర్ మొదట్ లో వరుస హిట్లతో మంచి దూకుడు చూపించిన తేజు తిక్క మొదలుకుని మొన్న తేజ్ ఐ లవ్ యు దాకా ఆరు డిజాస్టర్లు మూటగట్టుకోవడంతో పునఃసమీక్షలో పడ్డాడు. ఈ మెగా హీరో కొత్త సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మైత్రి సంస్థ తిరుమల కిషోర్ దర్శకత్వంలో చిత్రలహరి అనే టైటిల్ తో ఓ సినిమా తీయబోతున్నట్టుగా ఆ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మేకోవర్ కోసం అమెరికా వెళ్లి వచ్చిన తేజు దాని గురించి ఇప్పుడు ప్రస్తావించడం లేదు. అటు నిర్మాణ సంస్థ సైతం ఇతర సినిమాల అప్ డేట్స్ ఇస్తున్నా దీని గురించి మాత్రం చెప్పడం లేదు. సో ఇది ఇప్పట్లో ఉండటం అనుమానంగానే ఉంది.

మరోవైపు మేనల్లుడి కోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు టాక్. ఇలాంటి టైంలో అల్లు అరవింద్ సహాయ సహకారాలు తేజుకి ఉండటం అవసరమని గుర్తించి ఆ మేరకు బాధ్యతలు ఆయనకే అప్పజెప్పినట్టు టాక్. అరవింద్ సైతం మారుతీని దర్శకుడిగా తేజుతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. ఇటీవలే నేను లోకల్ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఓ మెగా హీరో కోసం తాను చిరంజీవికి రెండు గంటల సేపు కథ చెప్పానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. అది తేజు కోసమే అని ఇన్ సైడ్ టాక్. అరవింద్ తనకు నచ్చినందుకు చిరు దగ్గరికి ప్రసన్నను పంపాడని ఇన్ మరో న్యూస్. ఇవి అఫీషియల్ అప్ డేట్స్ కాకపోయినా మొత్తానికి ఆరు ప్లాప్స్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కెరీర్ ని కాస్త స్ట్రాంగ్ గా నడిపేందుకు చిరు అరవింద్ లు ఇద్దరు రంగంలోకి దిగడం నిజమే అనిపిస్తోంది.