ఇంద్రలో దుమ్ము రేపిన ఆ బుడ్డోడు హీరోగా వస్తున్నాడు

0master-teja-tolltwood-debut‘ఇంద్ర’ సినిమా ఆరంభంలో వచ్చే ఓ సీన్ వస్తుంది గుర్తుందా? విలన్ శివారెడ్డికి భయపడి ఎవరూ ముందుకు రాక పోవడంతో నేను ఉన్నాను నాయనమ్మా అంటూ ఓ బుడ్డోడు కత్తి పట్తి తొడగొడతాడు. ఈ సీన్లో నటించిన మాస్ట్ తేజ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల రొమాలు నొక్కబొడిచాయి.

ఆ కుర్రాడు తెలుగులో ‘ఇంద్ర’తో పాటు ‘చూడాలని ఉంది’, ‘యువరాజు’ ఇలా 50కి పైగా సినిమాల్లో బాల నటుడిగా చేశాడు. కొంతకాలంగా తర్వాత తెరమరుగైన ఈ కుర్రాడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్‌కి హీరోగా పరిచయం కాబోతున్నాడు.

మాస్ట‌ర్ తేజ ఇప్పుడు తేజ‌గా మారి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి సంస్థ‌లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు ప‌నిచేసిన హ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నిర్మాత గోపి మాట్లాడుతూ “ క‌థ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో జ‌రిగే యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. కుటుంబ‌స‌మేతంగా చూసేలా ఉంటుందని తెలిపారు.

సెప్టెంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది. `ఉయ్యాల జంపాల‌`, `స్వామిరారా` చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగీత ద‌ర్శ‌కుడు స‌న్నీ ఎం.ఆర్‌. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అని అన్నారు.

చిన్నతనంలో తేజను చూసి….. ఇపుడు అతడిని పోల్చుకోవడం కాస్త కష్టమే. అప్పటికి, ఇప్పటికీ లుక్ పరంగా చాలా మార్పు వచ్చింది.