శ్రీజ కళ్యాణ్ బేబి 2

0

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో కెరీర్ పరంగా తడాఖా చూపిస్తున్న సంగతి తెలిసిందే. వస్తూనే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారు. ఆ ఆనందంలో ఉండగానే `సైరా-నరసింహారెడ్డి` లాంటి వార్ ఎపిక్ సినిమాని డాడ్కి కానుకగా ఇస్తున్నాడు చెర్రీ. కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు చిరు.

ఈ శుభ సందర్భంలోనే మరో శుభవార్త. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ – కళ్యాణ్ దేవ్ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్నదే ఆ గుడ్ న్యూస్. ఈ విషయాన్ని అల్లుడు కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. `శ్రీజ కల్యాణ్ బేబి2#లోడింగ్` అంటూ ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ సందర్భం ఆనందదాయకం. కళ్యాణ్- శ్రీజ జంట వివాహం బెంగళూరులోని మెగాస్టార్ ఫామ్ హౌస్లో అత్యంత వైభవంగా జరిగింది. వేడుక ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కళ్యాణ్ – శ్రీజ కనిపించడం ఇంకా కళ్ల ముందే మెదులుతోంది. ఈలోగానే ఇలా శుభవార్త చెప్పారు. శ్రీజ తొలి సంతానం కుమార్తె నివ్రితి. ఆ తర్వాత మొదటి భర్తకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మెగా కాంపౌండ్ లో మరో గుడ్ న్యూస్ రామ్ చరణ్- ఉపాసన నుంచి రావాల్సి ఉందింకా. ఆ సందర్భం కోసమే వెయిటింగ్. అయితే కెరీర్ పరంగా లైఫ్ లో పరిణతి పరంగా ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని ఉపాసన ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చరణ్- ఉపాసన సొంతంగా ఓ ఇంటిని నిర్మించకున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer