బాలయ్య సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై చిరు కామెంట్!

0




chiru-comments-on-tax-exemption-for-satakarniఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా చిరు ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు కదా. మీ స్పందనేమిటని చిరును అడగ్గా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘గత చరిత్రను చూపించే సినిమాలకు రాయితీలు ఇవ్వడమనేది మంచిదే. అయితే ‘రుద్రమదేవి’కి కూడా ఇచ్చున్నట్లయితే గనక మరింత న్యాయం చేసినట్లయ్యేది. రుద్రమదేవి కూడా ఓ చరిత్రకు సంబంధించిన సినిమానే. గుణశేఖర్‌గారు కోట్లు ఖర్చుపెట్టి చేసిన సినిమా. దానికి తెలంగాణలో పన్ను మినహాయింపు లభించింది కానీ, ఏపీలో లభించలేదు. ఆ సినిమాకిచ్చి, ఈ సినిమాకీ ఇచ్చుంటే.. ‘ఓహో.. ఈ తరహా సినిమాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయ’ని అనుకోవచ్చు. దానికి ఇవ్వకపోవడం, దీనికి మాత్రం ఇవ్వడం విమర్శకు తావిస్తోంది’’.