ప‌వ‌న్‌ని బుజ్జ‌గిస్తున్నార‌ట‌

0Pawan-Kalyan-006ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. రెండోవారంలో ప్రెస్ మీట్ పెడ‌తా.. అని పవ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఆ ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్ ఏం చెప్తాడా?? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు చిరు ఇంట్లోనూ క‌ల‌క‌లం రేగింది. ప‌వ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌పై చిరు ముందు నుంచీ అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కొత్త‌గా పార్టీ పెట్ట‌డం, లేదంటే మ‌రో పార్టీ జెండా ప‌ట్టుకోవ‌డం రెండింటిలో ఏం చేసినా.. చిరు ఇమేజ్‌కి అది పెద్ద దెబ్బ‌.

కాంగ్రెస్‌లో కూడా త‌న‌ని వేలెత్తి చూపించేవాళ్లు ఎక్కువ అవుతారు. అందుకే ఎలాగైనా స‌రే.. ప‌వ‌న్ ప్రెస్‌మీట్ పెట్ట‌కూడ‌ద‌ని, ఒక వేళ పెట్టినా రాజ‌కీయాల‌పై మాట్లాడ‌కుండా చేయాల‌ని చిరు ప్ర‌యత్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప‌వ‌న్‌ని బుజ్జ‌గిస్తున్నార‌ట‌. కంగారు ప‌డొద్దు. రాజ‌కీయాల‌పై మాట్టాడ‌డానికి ఇది స‌మ‌యం కాదు.. అన్న రీతిలో నాలుగు మంచి మాట‌లు చెప్పి ప‌వ‌న్‌ని దారిలోకి తెచ్చుకోవాల‌ని మెగా క్యాంప్ విశ్వ‌ప్ర‌య‌త్నాలూ చేస్తోంది. మ‌రి వీటికి ప‌వ‌న్ ఎలా స్పందిస్తాడో మ‌రి.