మెగా డాటర్ బాగా సెట్టయినట్లే

0మెగా ఫ్యామిలిలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్లు కూడా ఉన్నారు. హీరోయిన్ గా మారోవైపు ఓ డాటర్ గారు రాణిస్తూనే ఉన్నారు. నిర్మాణ వైపు కూడా ఈ ఫ్యామిలీ అలవాటు పడుతోంది. కానీ టెక్నీషియన్స్ వైపు ఎవ్వరు పెద్దగా మొగ్గు చూపడం లేదేంటబ్బా అని అనుకుంటున్న సమయంలో కరెక్ట్ గా మెగా డాటర్ రంగంలోకి దిగింది. మెగా స్టార్ రీ ఎంట్రీతో ఆమె మొదటి ఎంట్రీ సక్సెస్ ఫుల్ గా ఉంటుందని ఎవరు ఊహించలేదు.

ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఖైదీ నెంబర్ 150వ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా కావడంతో మొదట అనుమానాలు వచ్చినా సినిమా రిలీజ్ తరువాత ఆమె టాలెంట్ ఏంటో అర్ధమయ్యింది. మెగాస్టార్ స్టయిలిష్ గా కనిపించడంలో ఆమె కృషి చాలానే కనిపించింది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో ఇంకాస్త టాలెంట్ బయటపడింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సుస్మిత ఇంతకు ముందు చెన్నై లో ఫ్యామిలీతో ఉండేది. కానీ ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా సక్సెస్ అవ్వడంతో హైదరాబాద్ కు మకాం మార్చేసింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ డిగ్రీ కూడా పూర్తి చేసుకున్న సుస్మిత పెళ్లి తరువాత సినిమాల్లో ట్రై చేద్దామనుకున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది. ఓ మంచి ఇల్లు సెట్ చేసుకొని కొత్త ప్రారంభం అంటూ సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేసుకున్నారు.