రంగస్థలం లోకి చిరంజీవి..

0మెగాస్టార్ చిరంజీవి , నయనతార జంటగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి ‘. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. బ్రిటీష్ వారిని త‌రిమికొట్టేందుకు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కర్నూలులోని ‘కోయిలకుంట్ల’ ట్రెజరీని కొల్లగొట్టాడు. ఆ ట్రెజ‌రీ సెట్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేశారు. ఈ సెట్ లో షూటింగ్ పూర్తి కాగానే రంగస్థలం సెట్ కు సైరా టీం వెళ్లనున్నారు. ఆ సెట్ లో కొన్ని సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట చిత్ర యూనిట్.

రంగస్థలం చిత్రం లో పక్క పల్లెటూరు తలపించేలా రామకృష్ణ ఆ సెట్ వేయడం జరిగింది. సినిమాలో ఓ హైలైట్ గా ఆ సెట్ నిలిచిందని చెప్పాలి. అందుకే అదే సెట్ లో ఇప్పుడు చిరంజీవి సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తుండగా , జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది కి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.