చిరు-నాగ్ అశ్విన్ మూవీ అప్డేట్

0

సావిత్రి జీవితచరిత్రగా రూపొందిన ‘మహానటి’ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ను ఎంతగానో అభినందించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడనీ, ఆ కథ పూర్తయిన తరువాత నేరేషన్ వుంటుందని వార్తలు వచ్చాయి. వైజయంతీ మూవీస్ తదుపరి సినిమా చిరంజీవితోననే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్ పై అశ్వనీ దత్ స్పదించారు. ‘ఇంతవరకూ మేం చిరంజీవితో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాము. అయిదవ సినిమా చేసే అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తాం. అలాంటి ఛాన్స్ వస్తే మేమే సగర్వంగా ఆ విషయాన్ని తెలియజేస్తాము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు సైరా షూటింగ్ తో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer