పవన్‌ 3వ విడాకులపై క్లారిటీ

0Anna-lezhneva-and-pawanపవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన మూడవ భార్యతో కూడా దూరంగా ఉంటున్నాడనే ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో జరుగుతున్న విషయం తెల్సిందే. సినీ వర్గాల్లో కూడా పవన్‌ మూడవ పెళ్లి పెటాకులు అయ్యింది అంటూ కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని, తాను ప్రస్తుతం తన మూడవ భార్య అన్నా లెజినోవాతో కలిసి సంతోషంగా ఉన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ చెప్పకనే చెప్పాడు.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ బోస్టన్‌ యూనివర్శిటీలో ఒక ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్లాడు. బోస్టన్‌కు ఒంటరిగా కాకుండా సతీసమేతంగా పవన్‌ కళ్యాణ్‌ వెళ్లడం ఇక్కడ గమనించదగ్గ విషయం. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం బోస్టన్‌లో ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య అన్నా కూడా ఉన్నారు. పవన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన శరత్‌ మరార్‌ కూడా అక్కడే ప్రస్తుతం ఉన్నారు. పవన్‌ విమానాశ్రయంలో భార్య అన్నాతో కలిసి ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.