Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ చేరిందట.. ఇంతకీ ఎవరు పంపారంటే..??

మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ చేరిందట.. ఇంతకీ ఎవరు పంపారంటే..??


సినీ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ మధ్య ఉండే స్నేహం పైకి కనపడకుండా ఉంటుంది కానీ వారు కూడా ఎప్పటికప్పుడు మంచి చెడులను అడుగుతూ ఉంటారు. సినిమాల పరంగా కాకుండా బయట కూడా ఎంతో స్నేహంగా సన్నిహితంగా ఉండే హీరోలలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఎక్కువగా ఫ్యాన్స్ కంటపడలేదు కానీ అప్పుడప్పుడు అంటే స్పెషల్ టైంలలో విష్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ దగ్గర పడటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి నుండి సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ చేరిందట. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా విష్ చేసాడు. ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇక తాజాగా పవన్ ఫ్యామిలీ నుండి మహేష్ ఫ్యామిలీకి గిఫ్ట్ చేరడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ గిఫ్ట్ పవన్ పంపారా.. అంటే కాదట. పవన్ భార్య అన్నా లెజ్నేవా పంపినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నమ్రత తెలిపింది. క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్ అలాగే ప్రత్యేకమైన నోట్ కూడా ఉందట. ఇంతకీ స్పెషల్ నోట్ లో ఏముందంటే.. మీ గురించి హృదయపూర్వకంగా ఈ పవిత్రమైన సీజన్ లో మీరు బావుండాలని ఆశీర్వదించబడతారని కోరుకుంటున్నాను.. అన్నా కళ్యాణ్’ అని రాసి ఉందట. ఇక ఈ స్పెషల్ కానుకకు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇలా కేవలం మహేష్ బాబు ఫ్యామిలీకి అనే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులకు అన్నా తన క్రిస్మస్ కానుకలను పంపుతున్నట్లు సమాచారం.