నయన్ సినిమా టాక్ ఏంటి?

0దక్షిణాదిన ఇప్పుడు నయనతార ఉన్నంత ఊపులో మరే హీరోయిన్ లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూనే.. మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుకుంటోందామె. మయూరి.. కర్తవ్యం లాంటి సినిమాలు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి విజయం సాధించాయి. ఈ వరుసలోనే ‘కోలమావు కోకిల’ అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసింది నయన్. అది తమిళంలో పెద్ద హిట్టయింది. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా బాగా ఆడుతోంది. ఈ చిత్రం తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో శుక్రవారమే విడుదలైంది. ఐతే తమిళంలో లాగా దీనికి ఇక్కడ గొప్ప టాక్ ఏమీ రాలేదు. సినిమా పర్వాలేదంటున్నారు తప్ప.. తమిళ జనాల మాదిరి ఆహా ఓహో అనట్లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు.

‘కోకో కోకిల’ మరీ ప్రత్యేకమైన సినిమా ఏమీ కాదు. నయన్ క్రేజ్.. నేటివిటీ ఫ్యాక్టర్.. అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కవుటై సినిమా తమిళంలో బాగా ఆడేసింది. ఐతే ఈ విషయాల్లో తమిళ ప్రేక్షకుల మాదిరి తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునేందుకు ఆస్కారం లేదు. తమిళ నేటివిటీ అనేది మైనస్ అయింది. దాని వల్ల ఇక్కడ అనుకున్నంతగా వినోదం పండలేదు. ఉదాహరణకు యోగిబాబు అక్కడ స్టార్ కమెడియన్. అందు వల్ల అతడికి నయన్ కు మధ్య వచ్చే సీన్లు తమిళంలో హిలేరియస్ అనిపించాయి. కానీ అతడిని మనవాళ్లు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఆ సీన్లన్నీ సాధారణంగానే అనిపించాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోసం లాజిక్ ను పట్టించుకోలేదు. అదీ కొంచెం మైనస్ అయింది. ఐతే నయనతార పెర్ఫామెన్స్ మాత్రం సూపరనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా జస్ట్ యావరేజ్ అంటున్నారు మనోళ్లు. అంతకుమించి ఏమీ లేదు.