ట్రైలర్ టాక్: ‘కోకోకోకిల’

0నయనతార ఈమద్య కాలంలో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. తమిళంలో ఈమె నటించిన చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకున్నాయి. దాంతో నయనతార క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈమెతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ కూడా క్యూ కడుతున్నారు. తాజాగా తమిళంలో ‘కోలమావు కోకిల’ అనే టైటిల్ తో నయనతార ఒక చిత్రాన్ని చేసింది. నెల్సన్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తాజాగా తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అక్కడ సంచలన విజయాన్ని దక్కించుకున్న కొలమావు కోకి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈనెల 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగులో నయనతారకు భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె చిరంజీవి సైరా చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ సినిమా అవ్వడంతో డబ్బింగ్ అయిన పర్వాలేదు అన్నట్లుగా ప్రేక్షకులు ఈమె చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కొలమావు కోకిల’ను తెలుగులో ‘కో కో కోకిల’ అనే టైటిల్ తో డబ్ చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘కో కో కోకిల’ చిత్రం చాలా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఒక అమాయకురాలు అయిన అమ్మాయి – మరియు ఆమె కుటుంబ సభ్యులు కొన్ని పరిస్థితుల కారణంగా స్మగ్లింగ్ – హత్యలు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో వారు ఏం చేశారు అనేది సినిమా కథగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. నయనతార లుక్ మరియు ఆమె కుటుంబ సభ్యుల పాత్రల్లో నటించిన నటీనటులు అద్బుతంగా సూట్ అయ్యారు. అన్ని విధాలుగా సినిమాకు హైప్ తీసుకు వచ్చేలా ట్రైలర్ ఉంది. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కో కో కోకిల తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. తమిళంలో విజయం దక్కించుకున్న చిత్రాలు తెలుగులో సక్సెస్ అవ్వాలని లేదు. కాని ఈ చిత్రం మాత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.